కరోనా వైరస్ ప్రభావం దాదాపు అన్ని రంగాలపై పడుతుంది. అలాగే క్రికెట్ పై కూడా కరనా ప్రభావం కాస్త ఎక్కువ గానే ఉంది. ఇప్పటికే పలు సిరీస్ లు వాయిదా పడ్డాయి. తాజా గా న్యూజిలాండ్ – ఆస్ట్రేలియా మధ్య జరిగే సిరీస్ కూడా వాయిదా పడింది. ఆస్ట్రేలియా జట్టు మూడు వన్డేలు, ఒక టీ 20 మ్యాచ్ ఆడేందుకు న్యూజిలాండ్ వెళ్లాల్సి ఉంది. కానీ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్ క్వారైంటెన్ నిబంధనలు చాలా కఠినంగా అమలు చేస్తుంది.
దీంతో ఆస్ట్రేలియా ఈ కఠిన నిబంధనల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిబంధనలను తమ కోసం కాస్త సడలించాలని న్యూజిలాండ్ ప్రభుత్వాని కోరింది. దీనికి న్యూజిలాండ్ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో న్యూజిలాండ్ టూర్ పై ఆస్ట్రేలియా వెనకడుగు వేసింది. దీంతో ఈ సిరీస్ ను వాయిదా వేస్తున్నట్టు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ఈ సిరీస్ ఈ నెల 28 నుంచి వచ్చె నెల 9 వరకు జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ సిరీస్ వాయిదా పడింది. అయితే ఈ సిరీస్ ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో తెలియాల్సి ఉంది.