కరోనాకు కొత్త పేరు, వైద్యం కోసం రోబోలు…!

-

కరోనా వైరస్ తీవ్రత అనేది ఇప్పుడు ఊహించని విధంగా పెరుగుతుంది. గురువారం ఒక్క రోజే 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. దీనితో ఇప్పుడు అక్కడ వైద్యులు కూడా వైద్యం చెయ్యాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకి వ్యాధి సోకిన వారి సంఖ్య అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరక 30 వేల మందికి ఈ వ్యాధి సోకింది అని అంతర్జాతీయ మీడియా అంటుంది.

అయితే వైద్యులకు వైరస్ సోకుతుంది అనే భయం నేపధ్యంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గువాంగ్‌డాంగ్‌లోని ప్రజావైద్యశాల కృత్రిమమేధతో పనిచేసే రెండు రోబోలను తయారు చేసింది. పింగ్‌ పింగ్‌, యాన్‌ యాన్‌ అనే రోబోలను తయారు చేసింది. ఈ రోబోల లోపలి భాగాల్లోకి కరోనా వైరస్‌ వ్యాపించినా సరే వాటిని స్వయంగా శుభ్రం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసారు శాస్త్రవేత్తలు.

ఈ రెండు రోబోలు పేషెంట్లకు మందులు కూడా ఇస్తాయి. వారు వాడేసిన పక్క దుప్పట్లను, పడేసిన చెత్తను సేకరించడమే కాకుండా… చార్జింగ్‌ అయిపోతే ఇవి తమంత తాము చార్జింగ్‌ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. ఇక కరోనా వైరస్ కి పేరు కూడా మార్చే ఆలోచనలో చైనా ప్రభుత్వం ఉంది. కరోనా వైరస్ అనేది ఒక కుటుంబం దీనిలో చాలా రకాలు ఉన్నాయి. కొత్త వైర్‌సను తాత్కాలికంగా 2019-ఎన్‌సీవోవీ (నావెల్‌ కరోనా వైర్‌స) అంటున్నారు.

చైనాలోని కొన్ని ప్రాంతాల్లో దీన్ని స్నేక్‌ ఫ్లూ, బ్యాట్‌ ఫ్లూ అని వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు దీనికి కొత్త పేరు పెట్టారు. ‘ఇంటర్నేషనల్‌ కమ్యూనిటీ ఆన్‌ టాక్సానమీ ఆఫ్‌ వైరసెస్‌ (ఐసీటీవీ)’ శాస్త్రజ్ఞులు. అయితే ఆ పేరు ఏంటీ అనేది బయటకు చెప్పలేదు. ఇక ఇదిలా ఉంటే చైనా ప్రభుత్వం దీని ప్రభావాన్ని అంతర్జాతీయ సమాజానికి తక్కువగా చేసి చూపిస్తుంది అంటున్నారు అంతర్జాతీయ వైద్య నిపుణులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version