ఏపీ లో మరో 34 కరోనా పాజిటివ్ కేసులు …!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో 41 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 109కేసులు నమోదు అయ్యాయి. తాజాగా 34 కేసులు నమోదు అయ్యాయి ఆంధ్రప్రదేశ్ లో. దీనితో కేసుల సంఖ్య 473 కి చేరుకుంది. గుంటూరు జిల్లాలో ఇప్పుడు అధికారులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

గుంటూరు 16 కృష్ణా 8 కర్నూలు 7 అనంతపురం 3 నెల్లూరు ఒక కేసు నమోదు అయ్యాయి. ఏపీలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. నెల్లూరు 56, కర్నూలు 91, కృష్ణా 44 కేసులు నమోదు అయ్యాయి. కేసులు తగ్గాయి అనుకున్న తరుణంలో ఈ విధంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ప్రకాశం జిల్లాలో 42 కేసులు నమోదు అయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కేసులు నమోదు కాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version