కరోనా వైరస్ ప్రభావం క్రికెట్ పై బాగానే చూపుతుంది. ఏకంగా నేడు జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. వెస్టిండీస్, ఐర్లాండ్ జట్టుల మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. నేడు రెండో వన్డే జరగాల్సి ఉంది. అయితే ఐర్లాండ్ కు చెందిన క్రికెటర్లకు కరోనా సోకడంతో నేటి మ్యాచ్ ను రెండు దేశాల క్రికెట్ బోర్డులు వాయిదా వేశాయి. ఇప్పటి వరకు ఐదుగురు ఐర్లాండ్ క్రికెటర్లు కరోనా బారీన పడ్డారు. దీంతో మ్యాచ్ నిర్వహించడం కష్టం భావించిన రెండు దేశాల క్రికెట్ బోర్డులు.. మ్యాచ్ ను వాయిదా వేశారు. అయితే కరోనా సోకిన ఐదుగురు ఐర్లాండ్ ఆటగాళ్లను ఐసోలేషన్ లో ఉంచారు.
కాగ వెస్టిండీస్, ఐర్లాండ్ జట్ల మధ్య 3 వన్డేలు, ఒక టీ 20 సిరీస్ జరుగుతుంది. ఇప్పటి వరకు కేవలం ఒక వన్డే మాత్రమే నిర్వహించారు. అయితే ఐర్లాండ్ క్రికెటర్లు వరుసగా కరోనా బారిన పడటంతో ఈ సిరీస్ పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే గత ఏడాది డిసెంబర్ లో ఐర్లాండ్ క్రికెట్ జట్టు అమెరికా పర్యటనకు వెళ్లి అక్కడ క్రికెట్ ఆడింది. అయితే అమెరికాలోనే ప్లేయర్లకు కరోనా సోకి ఉండవచ్చు అని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు భావిస్తుంది. కాగ తర్వాతి మ్యాచ్ ల గురించి త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.