ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీతో కలసి నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) కలసి పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. మంగళవారం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార బీజేపీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు కాషాయ పార్టీని వీడి సమాజ్‌వాది పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారం మంత్రికి పదవికి రాజీనామా చేసి సమాజ్‌వాది పార్టీలో చేరారు.
ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన శరద్ పవార్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో మతపరమైన పోలరైజేషన్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. రాష్ట్రంలో కచ్చితంగా మార్పు కోసం ప్రయత్నం చేస్తాం’ అని ఎన్‌సీపీ చీఫ్ పేర్కొన్నారు.