బ్రేకింగ్ : వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్

-

మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం రేపుతోంది. ఈ ఉదయమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ అని తేలగా ఇప్పుడు ఆయన సోదరుడు, నాగాబాబు కుమారుడు అయిన వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్నీ ఆయన స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించాడు.

తనకు ఈ ఉదయం కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది అని ప్రస్తుతానికి తనాకు కరోనా లక్షణాలు ఏవీ లేక పోయినా ఈ కరోనా పాజిటివ్ అని తేలడంతో హోం క్వారెంటైన్ లోకి వెళ్ళిపోయానని పేర్కొన్నారు. ఇక తనను కలిసిన వారందరూ ముందస్తు జాగ్రత్త చర్యగా టెస్ట్ చేయిన్చుకోవాల్సిందిగా కోరారు ఆయన. ఇక మెగా ఫ్యామిలీలో ఇద్దరికీ ఒకే రోజు కరోనా పాజిటివ్ అని తేలడంతో మిగతా వారంతా టెస్ట్ లు చేయించుకునే పనిలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version