ఇదేం గోల… కాకులకు కరోనా…?

-

పులికి కరోనా వచ్చింది అనే వార్త ఇంకా జనం చదువుతుండగానే ఇప్పుడు కరోనా కాకులకు కూడా వచ్చింది అనే వార్త ఆందోళన కలిగిస్తుంది. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కూడా జనాలను భయపెడుతున్నాయి. సోషల్ మీడియాలో కాకులకు కరోనా రావడంపై కాస్త ఎక్కువగానే ప్రచారం చేస్తున్నారు. తమిళనాడులోని పనపాక్కం సమీపంలో పన్నియార్ గ్రామంలోని కులత్తుమేడు ప్రాంతంలో ఈ నెల 1వ తేదీన దాదాపు 10కి పైగా కాకులు చనిపోయాయి.

లాక్ డౌన్ అమలులో వుండడం తో ప్రజలు ఇళ్ళలోనుంచి బయటకు రావడం లేదు కాబట్టి ఆహారం లేక కాకులు చనిపోతున్నాయని అనుకున్నారు. అధికారులు కూడా ఇదే భావించి లైట్ తీసుకున్నారు. కాని కాకులు వరుసగా ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. కాకులకు కరోనా వైరస్ వచ్చింది ఏమో అని అనుమానం వ్యక్తమవుతుంది. మృతి చెందిన కాకుల సంఖ్య ఎక్కువ కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాకులకు కరోనా వైరస్ సోకిందని, అందుకే ఇవి మరణిస్తున్నాయని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. కాకులు ఎందుకు చనిపోతున్నాయి అనే దాని మీద ఆరోగ్య శాఖ అధికారులు… కాకుల మరణానికి కారణాన్ని అన్వేషించేందుకు రంగంలోకి దిగారు. చనిపోయిన కాకులకు కరోనా పరిక్షలు చేస్తున్నారు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version