తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ రావడంతో అనుచరుల్లో కలవరం మొదలయింది. ఆయనకే కాక కొందరు పోలీసు అధికారులకి కూడా టెన్షన్ మొదలయింది. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారిపై దురుసుగా వ్యవహరించారనే అభియోగం పై కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ కేసులో రెండు రోజుల క్రితం ఆయన్ను పోలీసు కస్టడీకి తీసుకొని విచారించిన అనంతపురం పోలీసులు విచారించారు.
అయితే తాజాగా కడప సెంట్రల్ జైల్లో సిబ్బందికి, 700 మంది ఖైదీల కు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా 14 మంది జైలు సిబ్బందికి, 303 మంది ఖైదీలకు కరోనా ఫాజిటీవ్ గా నిర్ధారణ అయింది. ఇందులో జేసీ ప్రభాకర్ రెడ్డి కి కూడా కరోనా ఫాజిటీవ్ అని తేలడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన మొదలయింది. ఎందుకంటే ఆయన జైలు నుండి రిలీజ్ కాగా ఒకరోజు ఇంట్లో ఉండి వెళ్లారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. అంతే కాదు జైల్లో మెరుగైన వైద్యం అందుతుందో లేదో అని కూడా ఆందోళనలో ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం జేసీ ప్రభాకర్ రెడ్డికి మెరుగైన ఆసుపత్రిలో వైద్యం అందించాలని అంటున్నారు కుటుంబ సభ్యులు.