కరోనా నుండి మనకి ఉపశమనం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్న ఫలితం లేదు. ఇంకా వందల్లో మరణాలు వస్తూనే వున్నాయి. కరోనా కేసులు కూడా నమోదవుతూనే వున్నాయి. ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
ప్రతీ ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏది ఏమైనా సోషల్ డిస్టెన్స్ పాటించడం, బయటకు వెళ్తే మాస్క్ ధరించడం వంటి పద్ధతులని అనుసరిస్తే మంచిది.
ఇక మనం గత 24 గంటల్లో కరోనా వైరస్ కి సంబంధించి అప్డేట్స్ గురించి చూస్తే.. గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 640 మంది మరణించారు. దీనితో ఇప్పటి వరకు 422662 మంది చనిపోయారు అని తాజా నివేదిక ద్వారా తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే రికవరీ వివరాలలోకి వెళితే… దేశంలో మరో 38465 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి గత 24 గంటల్లో రికవరీ అవ్వడం జరిగింది. దీనితో ఇప్పటి వరకూ 30701612 మంది కరోనా నుండి రికవరీ అయ్యారు. ఇంకా 4404 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకూ 450706257 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ద్వారా తెలుస్తోంది. మందికి 24 గంటల్లో 4392697 వ్యాక్సిన్లు వేసినట్లు తెలుస్తోంది.