విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన కార్మికులు

-

విశాఖ: స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని హైకోర్టులో కేంద్రప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో కేంద్రం తీరుపై స్టీల్ ప్లాంట్ కార్మికులు మండిపడుతున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ప్లాంట్ పరిపాలన భవనం ఎదుట ఆందోళనకు దిగారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్‌పై పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం కానివ్వమని చెబుతున్నారు. అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా వెనకాడమని అంటున్నారు.

ఇక ప్లాంట్ ప్రైవేటీకరణను రాష్ట్ర పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటీకే సీఎం జగన్ కేంద్రప్రభుత్వానికి లేఖలు రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రజల అభిప్రాయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. అయినా కేంద్రం వెనకడగువేయడంలేదు. ప్లాంట్ ప్రైవేట్ పరం తప్పదని ఇప్పటీకే చాలా సార్లు తేల్చి చెప్పింది. తాజాగా హైకోర్టు వేదికగా మరోసారి స్పష్టం చేసింది.

కాగా స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జేడి లక్ష్మినారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, శతశాతం ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version