భారత్ లో కరోనా రికార్డ్.. ఒక్కరోజులో భారీగా పెరిగిన సంఖ్య..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 45,720 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 1,129 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 

దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 12,38,635కు చేరింది. క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 29,861కు పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 7,82,606 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం 4,26,167 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version