కరోనా వాక్సిన్.. నో స్టాక్..?

-

గత కొన్ని రోజుల క్రితం అమెరికా కు చెందిన గిలాడ్ సైన్సెస్ సంస్థ రెమ్ డిసీవర్ అనే ఔషధాన్ని కరోనా చికిత్స కోసం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. భారత దేశంలోని హెట్రో, సిప్లా సహా మరికొన్ని ఫార్మా కంపెనీల ద్వారా మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అతి ఎక్కువగా కరోనా లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ను సూచిస్తున్నారు వైద్యులు. అయితే ప్రస్తుతం హెట్రో ఈ ఔషధాన్ని ఆన్లైన్ లో ఉంచింది. ఆన్ లైన్ ప్రిస్క్రిప్షన్ సహా వైద్యుల సూచన లను అప్లోడ్ చేసి పేమెంట్ చేసి హోమ్ డెలివరీ పొందడానికి అవకాశం కల్పించింది.

కాగా ఈ ఔషధానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది దీంతో ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంతోమంది నిరాశ చెందుతున్నారు. కారణం ఈ ఔషధం ఆన్లైన్లో నో స్టాక్ అని చూపిస్తుంది. మొన్నటికి మొన్న ఆన్లైన్ లోకి వచ్చిన ఈ ఔషధం అప్పుడె న్నో స్టాక్ అని చూపించడంతో ఎంతోమంది ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version