కోవిడ్ వాక్సినేషన్ కోసం తంటాలు పడుతున్నారు విజయవాడ నగరవాసులు. ఫస్ట్ డోస్ ఇప్పటివరకు దొరకని పరిస్థితి విజయవాడ లో ఏర్పడింది. సెకండ్ డోస్ ఎక్కడ వేస్తారు అన్న దానిపైన పూర్తి క్లారిటీ లేదు.. అధికారుల నుంచి కూడా సమాధానం రావట్లేదు.
వ్యాక్సినేషన్ ఎక్కడ దొరుకుతుందో తేలిక విజయవాడ లోని అన్ని సచివాలయాలకు నగర వాసులు తిరుగుతున్నారు. వాక్సినేషన్ ఎక్కడ చేస్తారు తెలియకుండా ఏవిధంగా వ్యాక్సిన్ వేయించుకుంటామని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని విజయవాడ వాసులు నిలదీస్తున్నారు. కో వ్యాక్సిన్ ఒక చోట, కోవి షీల్డ్ ఒక చోట చేర్చాలి ఉన్నా… ఇంతవరకు ఏది ఎక్కడ దొరుకుతుందో సరైన సమాచారం సచివాలయ ఉద్యోగులు,అధికారులు ఇవ్వలేదు.