నేడు దేశవ్యాప్తంగా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ మొదటి విడత కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా దానిని ప్రారంభించనున్నారు. ఈ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ పాల్గొననున్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మొదటివిడతలో వ్యాక్సినేషన్, రాష్ట్రవ్యాప్తంగా 332 వ్యాక్సిన్ సెషన్స్ సైట్లలో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ జరగనుంది.
ఇక తెలంగాణలో కూడా 139 చోట్ల వ్యాక్సిన్ వేయనున్నారు. ముందుగా పారిశుధ్య కార్మికులకి వ్యాక్సిన్ వేయనున్నారు. ఇక ఇప్పటికే ఇప్పటికే రాష్ట్రాలకి చేరుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ అనుగుణంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి ప్రభుత్వాలు. ఇక ఈరోజు తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల కూడా వ్యాక్సిన్ వేయించుకోనున్నారు.