బిగ్ బ్రేకింగ్ : గాలి ద్వారా కరోనా.. తేల్చేసిన పరిశోధకులు.!

-

ప్రపంచం మొత్తాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి గాలిలోని సూక్ష్మ రేణువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని వందలాది పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకు తమ వద్ద ఆధారాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ  కు తెలిపారు. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ఈ అంశంపై ఓ క‌థ‌నాన్ని రాసింది. 32 దేశాల‌కు చెందిన 239 మంది శాస్త్ర‌వేత్త‌లు.. క‌రోనా వైర‌స్ గ్యాలి ద్వారా వ్యాపిస్తుంద‌ని పేర్కొంటున్నారు.  ఆ శాస్త్ర‌వేత్తలంతా డ‌బ్ల్యూహెచ్‌వోకు త‌మ ప్ర‌తిపాద‌న కూడా పంపారు.

క‌రోనా వైర‌స్ సోకిన మ‌నిషి ద‌గ్గినా.. తుమ్మినా.. నోటి నుంచి కానీ ముక్కు నుంచి వ‌చ్చే తుంప‌ర్ల వ‌ల్ల‌.. క‌రోనా వైర‌స్ సోకుతుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో వెల్ల‌డించింది. అయితే వైర‌స్‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రిపిన శాస్త్ర‌వేత్త‌లు మాత్రం.. గాలి ద్వారా కూడా క‌రోనా సంక్ర‌మించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తేల్చారు. అయితే, కరోనా  గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్న విషయానికి సంబంధించిన ఆధారాలు సరిగాలేవని డబ్ల్యూహెచ్‌వో అంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version