కరోనా వైరస్… స్మార్ట్ ఫోన్ పట్టుకోవాలి అన్నా, న్యూస్ పేపర్ పట్టుకోవాలన్నా, పాల ప్యాకెట్ పట్టుకోవాలన్నా… ఇప్పుడు ఏది పట్టుకోవాలనుకున్నా సరే అమ్మో దీని మీద కరోనా వైరస్ ఉందా అనే భయం వెంటాడుతుంది. దీనితో ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు జనాలకు. కరోనా వైరస్ ఏ వస్తువు మీద ఎన్ని రోజులు బ్రతికి ఉంటుందో చూద్దాం. దాన్ని బట్టీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం గ్లాస్ సర్ఫేస్‌పైన 96 గంటల వరకు అంటే నాలుగు రోజులు, స్టెయిన్‌లెస్ స్టీల్, ప్లాస్టిక్ పైన 72 గంటలు అంటే మూడు రోజులు, స్టెయిన్‌లెస్ స్టీల్ పైన మూడు రోజులు, కాపర్‌పైన నాలుగు గంటలు, కార్డ్‌బోర్డ్ పైన 24 గంటలు ఉంటుందని గుర్తించారు. హ్యాండ్‌వాష్‌తో చేతులు కడుక్కున్నా, శానిటైజర్ అప్లై చేసినా వెంటనే స్మార్ట్‌ఫోన్ పట్టుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఇక స్మార్ట్ ఫోన్ నుంచి కరోనా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఈ వైరస్ తీవ్రతను కట్టడి చెయ్యాలి అంటే చాలా శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. అలా అయితేనే కరోనా వైరస్ ని కట్టడి చేయడం సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఏ వస్తువు పట్టుకున్నా సరే దాన్ని శుభ్రం చేసి పట్టుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.