Fact Check: ప‌్ర‌తి క‌రోనా పేషెంట్‌కు కేంద్రం రూ.3 ల‌క్ష‌లు ఇస్తోందా..?

-

కరోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం అనేక ర‌కాల ఫేక్ వార్త‌లు ఎక్కువ‌గా ప్ర‌చారం అవుతున్నాయి. కొంద‌రు పనిగ‌ట్టుకుని మ‌రీ ఉన్న‌వీ, లేనివీ క‌లిపి న‌కిలీ వార్త‌ల‌ను సృష్టించి ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో జ‌నాలు వాటిని నిజ‌మ‌ని న‌మ్మి మోస‌పోవ‌డ‌మే కాక‌.. ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ఇక తాజాగా సోష‌ల్ మీడియాలో క‌రోనాపై మ‌రొక ఫేక్ వార్త ఎక్కువ‌గా ప్ర‌చారం అవుతోంది. అదేమిటంటే…

కేంద్రం ప్ర‌భుత్వం ప్ర‌తి క‌రోనా పేషెంట్‌కు రూ.3 ల‌క్ష‌లు ఇస్తోంద‌ని, ఆ మొత్తాన్ని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు అంద‌జేస్తుంద‌ని, దీంతో ప్ర‌భుత్వాలు ఆ సొమ్ము‌తో కోవిడ్ 19 రోగుల‌కు చికిత్స అందిస్తున్నాయ‌ని.. ఓ ఆడియో మెసేజ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే ఇందులో ఎంత‌మాత్రం నిజం లేద‌ని.. కేంద్ర హోం శాఖ వివ‌ర‌ణ ఇచ్చింది. స‌ద‌రు వార్త పూర్తిగా అబ‌ద్ధ‌మ‌ని, అందులో నిజం లేద‌ని అధికారులు తెలిపారు.

కాగా క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు వ‌చ్చే వార్త‌ల్లో ఎక్కువ‌గా న‌కిలీవే ఉంటున్నాయ‌ని.. క‌నుక ప్ర‌జ‌లు వాటిని న‌మ్మేముందు ఒక్క‌సారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల‌ని పోలీసులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version