ఎండాకాలంలో కరోనా నశిస్తుందని చెప్పలేం.. జాగ్రత్తలు తప్పనిసరి: WHO

-

కరోనా వైరస్‌ రోజు రోజుకీ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఆ వైరస్‌ పట్ల జనాల్లో భయాందోళనలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో నలుగురిలో తిరగాలంటేనే జంకుతున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తోంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ కరోనా వైరస్‌ పై జనాలకు ఇది వరకే జాగ్రత్తలు తెలియజేసింది. అయితే తాజాగా ఆ సంస్థ చెబుతున్నదేమిటంటే.. కరోనా వైరస్‌ ఎలాంటి వాతావరణ స్థితిలో అయినా సరే.. వ్యాప్తి చెందుతుందట. అంటే.. చలికాలం, ఎండాకాలం లేదా తేమ ఎక్కువగా ఉన్న వాతావరణం.. ఇలా ఏ వాతావరణంలో అయినా సరే ఆ వైరస్‌ నశించదట.

కోవిడ్‌-19 వైరస్‌ ఇంతకు ముందు కేవలం చల్లగా ఉన్న వాతావరణంలోనే వ్యాప్తి చెందుతుందని, వేడిగా వాతావరణం ఉంటే ఆ వైరస్‌ నశిస్తుందని అనుకున్నామని, కానీ వాతావరణ పరిస్థితులతో సంబంధ లేకుండా ఆ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది. ఎండాకాలం అయినా సరే.. కరోనా నశిస్తుందని అనుకోవడానికి వీలు లేదని, కనుక ఏ వాతావరణంలో అయినా సరే.. ఈ వైరస్‌ రాకుండా ఉండేందుకు కావల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సంస్థ సూచిస్తోంది.

అయితే ఎండాకాలంలో శ్వాసకోశ సమస్యలు వచ్చేందుకు అవకాశం కొంత తక్కువగా ఉంటుందని, అయినప్పటికీ కరోనా వైరస్‌ను తక్కువగా అంచనా వేయకూడదని WHO హెచ్చరిస్తోంది. వీలైనంత వరకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, తరచూ చేతులను హ్యాండ్‌ వాష్‌తో శుభ్రం చేసుకోవాలని, దగ్గినా, తుమ్మినా, జ్వరంగా ఉన్నా తరచూ చేతులను హ్యాండ్‌ శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని WHO చెబుతోంది. కాబట్టి ఎండాకాలం వస్తుంది కదా.. అని లైట్‌ తీసుకోకండి. కరోనా వైరస్‌ నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version