ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా సరే ఫలితం మాత్రం ఉండటం లేదు. గవర్నర్ కార్యాలయంలో కరోనా పాజిటివ్ వచ్చిన విషయం మరువక ముందే ఆరోగ్య శాఖా మంత్రి పేషీ లో కూడా కరోనా కలకలం రేగింది. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలో పనిచేసే అటెండరుకు కరోనా వచ్చింది.
అతనికి కరోనా లక్షణాలు కనపడట౦తో… మంగళవారం నిర్వహించిన ట్రూనాట్ పరీక్షలో ప్రిజంప్టివ్ పాజిటివ్ రాగా… తుది నిర్ధారణకు నమూనాను వైరాలజీ ల్యాబ్‌కి (ఆర్టీపీసీఆర్ పరీక్షకు) పంపగా… అటెండర్‌ను పిన్నమనేని సిద్దార్ధ వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకినా విషయం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి నాని, ఆయన భద్రత సిబ్బంది, పేషీలోని మిగతా అధికారులు, ఉద్యోగులు కలిపి మొత్తం 12 మందికి పరీక్షలు చేయించుకున్నారు.