కరోనా నుంచి ప్రాణాలతో బయటపడి కోలుకున్న వారు నిజంగా ఇప్పుడు లక్కీనే. వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇప్పుడు వాళ్ళు వైద్యులు ఎం చెప్పినా చేస్తున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి ఇప్పుడు ఒకరకంగా అధ్రుష్టవంతుడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ లు చేస్తున్నారు. తాజాగా వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాడని ఏకంగా 20 మంది ఘన స్వాగతం పలికారు.
ఈ ఘటన తమిళనాడు లోని చెన్నై లో చోటు చేసుకుంది. డిశ్చార్జ్ అయిన వ్యక్తికి భారీ స్వాగతం పలుకుతూ ఊరేగింపుగా తీసుకుని వెళ్ళారు. ఢిల్లీ మహానాడుకు వెళ్లి తిరిగొచ్చిన శీర్గాళి సభానాయకర్ వీధికి చెందిన 48 ఏళ్ల వ్యక్తి కరోనాతో తిరువారూర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొంది కోలుకుని బయటపడ్డాడు. పది రోజుల చికిత్స తర్వాత ఆయన్ను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
శీర్గాళి క్లాక్ టవర్ ప్రాంతానికి చేరుకున్న ఆ వ్యక్తికి ఘన స్వాగతం పలకాలని నిర్ణయం తీసుకుని… బంధువులు, స్నేహితులు శాలువా కప్పి ఊరేగింపుగా ఇంటికి తీసుకుని వెళ్ళారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘన, వైద్యుల సూచనలు పాటించలేదు అని పలువురు ఫిర్యాదులు చేసారు. దీనితో వారిపై కేసులు నమోదు చేసారు.