మీ ముక్కు బ్లాక్ అయ్యిందా…? అయితే ఈ రెమిడీస్ మీకోసం..!

-

చాలా మంది కరోనా వైరస్ బారిన కూడా పడిపోతున్నారు. దీనితో అందరికీ భయం ఎక్కువయింది. చిన్నపాటి జలుబు, దగ్గు వచ్చినా కూడా కంగారు పడిపోతున్నారు. ఏది ఏమైనా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం ముఖ్యం.

వాతావరణం పదేపదే మారడం వల్ల కొన్ని కొన్ని సార్లు జలుబు వస్తుంది. దీని కారణంగా ముక్కు బ్లాక్ అయిపోతుంది. అప్పుడు నిజంగా ఏ రెమిడీస్ ని పాటించినా ఫలించక పోవచ్చు. కానీ ఈ హోమ్ రెమిడీస్ ని కనుక పాటించారు అంటే ఆ సమస్య నుంచి సులువుగా బయటపడడానికి వీలవుతుంది. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం పూర్తిగా చూసేయండి.

కర్పూరం:

కర్పూరం లో మంచి గుణాలు ఉంటాయి. దీనివల్ల ముక్కు బ్లాక్ అయిన కూడా సులువుగా మీరు దాని నుంచి బయట పడడానికి వీలవుతుంది. దీనికోసం మీరు ఏం చేయాలంటే కొద్దిగా కర్పూరం తీసుకుని కొబ్బరి నూనెతో కలిపి లేదా కేవలం కర్పూరాన్ని వాసన చూడండి/ ఇలా చేయడం వల్ల ఫ్రీ గా ఉంటుంది.

కొబ్బరి నూనె:

ముక్కు బ్లాక్ అయిపోతే బయటపడడానికి కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది. మీ ముక్కు మూసుకుపోయినప్పుడు ముక్కు లో కొద్దిగా కొబ్బరి నూనె వేయండి. దీంతో మీకు వెంటనే రిలీఫ్ ఉంటుంది.

చిన్న వ్యాయామం:

ముక్కు బ్లాక్ అయినప్పుడు మీరు చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా బయటపడవచ్చు దీని కోసం మీరు ముక్కుని మూసేసి మీ తలను వెనక్కి వంచండి. మీ శ్వాసని అలా వదిలేసి ఆ తర్వాత ముక్కుని ఓపెన్ చేయండి దీంతో శ్వాస పీల్చుకోవడం సులువవుతుంది.

ఆవిరి పట్టడం:

వేడినీళ్లలో కొద్దిగా ఆరోమెటిక్ ఆయిల్ మరియు విక్స్ క్యాప్సిల్స్ ని వేయండి ఇప్పుడు ఆ వేడినీళ్ళల్లో ముఖం పెట్టి ఆవిరి పట్టండి. దీని వల్ల కూడా మీకు మంచి రిలీఫ్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version