కిమ్ జాంగ్ ఉన్… మంత్రి కొడాలి నానీ స్టైల్ లో చెప్పాలి అంటే క్రూరత్వానికి అమ్మా మొగుడు ఈ అధ్యక్షుడు. ఉత్తర కోరియా సుప్రీం లీడర్. ఈ పేరు వింటే చాలు ప్రపంచానికి క్రూరత్వం అంటే ఏంటో స్పష్టంగా అర్ధమవుతుంది. అసలు మనుషులను మనుషులుగా చూడని ఈయన ఎవరిని అయినా చంపడానికి వెనకాడని మనస్తత్వం ఈయనది. ఆయన మాట వినకపోతే భార్య అయినా పిల్లలు అయినా ఎవరు అయినా ఒకటే.
అందుకే అక్కడి అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. సార్ మాట కాదని, సార్ చెప్పింది చేయకుండా ఉండటం గాని చేస్తే నరకం అంటే ఏంటో బ్రతికి ఉండగానే కనపడుతుంది ప్రజలకు. చావు ఏ రూపంలో వస్తుందో అర్ధం కాని పరిస్థితి. ఇప్పుడు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం అక్కడి అధికారులకు చుక్కలు చూపిస్తుంది. కరోనా గనుక దేశంలోకి అడుగు పెడితే చంపేస్తా అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
కొవిడ్ వైరస్ దేశంలోకి రాకుండా కట్టడి చేయాలని, విఫలమైతే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన అధికారులకు స్పష్టమైన హెచ్చరికలు చేసారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో ఉదాసీనత కనబరిచినట్లు ఆరోపణలు రావడంతో అధికార వర్కర్స్ పార్టీ వైస్ ఛైర్మన్ రీ మాన్ గొన్, పాక్ తే డొక్‌ను పదవి నుంచి తప్పించారు ఆయన. వైరస్ దేశంలోకి వచ్చే అవకాశం ఉన్న అన్ని మార్గాల్ని మూసివేయాలని ఆయన ఆదేశించారు. విదేశీయులను అన్ని తనిఖీలు చెయ్యాలని అధికారులకు ఆదేశించారు.