వ్యాక్సిన్ వేయించుకుంటే పదిహేను రోజులు కరోనా పాజిటివ్.. అసలు విషయం చెప్పిన ఏపీ సర్కార్ !

-

కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని వస్తుందని కొద్ది రోజులుగా ఏపీలో ఒక ఆడియో వైరల్ అయింది. ఏపీలో ఉన్న వాలంటీర్లకు అధికారులు వివరిస్తున్నట్టుగా ఉన్న సదరు ఆడియో సంచలనం రేపడంతో ఏపీ వైద్యారోగ్య శాఖ రంగంలోకి దిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని తేలుతుందనేది వాస్తవం కాదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది. కోవాక్సిన్ అనేది ఉత్తేజం లేని వ్యాక్సినే తప్ప శక్తి లేనిది కాదని, కోవిషీల్డ్ అనేది వైరల్ వెక్టార్ వ్యాక్సినే కానీ శక్తి లేనిది కాదని పేర్కొంది.

ఇందులో SARS Cov2 వైరస్ లేదని, ఇందులో కేవలం SARS Cov2 యొక్క జన్యు పదార్ధంలో కొంత భాగం మాత్రమే ఉంటుందని అన్నారు. ఈ రెండు వ్యాక్సిన్లలో ఏ ఒక్కటీ RTPCR పాజిటివ్ కు దారి తీయవని, వ్యాక్సినేషన్ తరువాత RTPCRలో పాజిటివ్ నిర్ధారణ అయితే, వారిలో కోవిడ్ వ్యాధి ఉనికి ఉందని అర్థం అని పేర్కొంది. అంతే కానీ వ్యాక్సినేషన్ కారణంగా ఈ పాజిటివ్ వచ్చినట్లు కాదని, కోవిడ్ వ్యాక్సినేషన్ తరువాత జ్వరం వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. పారాసిటమాల్ మందు బిళ్లలతో చికిత్స అందించవచ్చని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version