భార‌త్‌లో క‌రోనా రికార్డుల మోత‌

-

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ రికార్డుల మోత మోగిస్తోంది. గ‌త 24 గంట‌ల్లో ఏకంగా 66,873 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3,231,754కు చేరుకుంది. అలాగే.. గ‌త 24 గంట‌ల్లో 1,066మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 60,000కు చేరువ‌లో ఉంది. ఇక అత్య‌ధికంగా కేసులు న‌మోదు అవుతున్న రాష్ట్రాలు ఇలా ఉన్నాయి.

మ‌హారాష్ట్ర‌(703,823), త‌మిళ‌నాడు (391,303), ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (371,639), క‌ర్నాట‌క‌ (291,826), ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(197,000) పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,64,071కు చేరుకుంది. కాగా, ప్ర‌పంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య‌ 24,042,682కు చేరుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు 16,591,338మందికిపైగా కోలుకున్నారు. 822,499మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. అమెరికాలో 5,954,810, బ్రెజిల్‌లో 3,674,176 కేసులు న‌మోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version