రాహుల్ తో భోజనం 900 యూరోలు!

-

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి భోజనం చేసిన వారి దగ్గర నుంచి  900 యూరోలు (సుమారు రూ.82,500)వసూలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవల రాహుల్ యూకే వెళ్లిన సంగతి తెలిసిందే.. అయితే అక్కడ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో  పార్టీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ మాట్లాడారు…ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఒక్కొక్కరి దగ్గర నుంచి 900 యూరోలు వసూలు చేయడాన్ని సొంత పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. విదేశాల్లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు భారీ మొత్తంలో నిధులు సేకరించడం ఏమాత్రం సమంజసంగా లేదని పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఓవర్సీస్ లో భాజపా ఏ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తోంది. ఐఓసీ ఆధ్వర్యంలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ సమావేశాలు గందరగోళంగా ఉంటున్నాయి అంటూ పార్టీ సీనియర్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version