బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొర్రెలు కాదు.. రేవంత్ రెడ్డి కి కౌంటర్..!

-

మేం గేట్లు తెరిస్తే బిఆర్ఎస్ ఖాళీ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. మేము గేట్లు తెరిస్తే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా వస్తారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని గేట్లు తెరిస్తే రావడానికి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొర్రెలు కాదని కౌంటర్ ఇచ్చారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ఏదో అభద్రతాభావంతో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలే మా ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో తెలీని పరిస్థితి అంటున్నారు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో నుండే ఏకనాథ్ షిండేలు వస్తారని బిజెపి నేతలు అంటున్నారని అన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version