కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ కు డిసిజీఐ అనుమతి…

-

కరోనా వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు తమ తమ వైద్య నిపుణులని అందరినీ ఆ పని మీదే కూర్చోపెట్టాయి. ఇక ఇండియాలో కూడా కరోనా వాక్సిన్ కు సంబంధించిన ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయి. ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ కలిసి డెవలప్ చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ కూడ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు దశలను పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ ఇప్పుడు మూడో దశకు కూడా దిగాయి.

ఈ మూడో దశ ట్రయల్స్ కోసం అక్టోబర్ 2వ తేదీన దరఖాస్తు చేసుకోగా, డిసిజీఐ తాజాగా ఈ అనుమతులు మంజూరు చేసింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో 19 వేరు వేరు ప్రాంతాల్లో 18 ఏళ్లకు పైబడిన వారిపై మూడో దశ ట్రయల్స్ ను నిర్వహించేందుకు ఈ అనుమతులు కోరాయి ఐసీఎంఆర్, భారత్ బయోటెక్. ఇక డిసిజీఐ అనుమతులు ఇవ్వడంతో త్వరలోనే ట్రయల్స్ ప్రారంభం కాబోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version