కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో మంగళవారం (15-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ పాత్ర కీలకమని, ఈ విషయంలో భారత్ సహాయం ప్రపంచానికి అవసరమని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
2. కరోనా వైరస్‌కు గాను పూర్తి స్థాయి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు 2024 వరకు సమయం పడుతుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా అన్నారు. ఈ ఏడాది చివరి వరకు వ్యాక్సిన్ వస్తుందని అనుకుంటే పొరపాటు పడినట్లేనని తెలిపారు.
3. ప్రపంచంలో కోవిడ్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య భారత్‌లోనే ఎక్కువగా ఉందని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. కోవిడ్ రికవరీల విషయంలో భారత్ బ్రెజిల్‌ను దాటింది. మొత్తం 37,80,107 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
4. దేశంలో కొత్తగా 83,809 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 49,26,914కు చేరుకుంది. 80,827 మంది చనిపోయారు. 9,73,175 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 37,80,107 మంది కోలుకున్నారు.
5. తెలంగాణలో కొత్తగా 2,180 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,60,571కి చేరుకుంది. 1,29,187 మంది కోలుకున్నారు. 984 మంది చనిపోయారు. 30,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
6. ఏపీలో కొత్తగా 8,846 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,83,925కు చేరుకుంది. 4,86,531 మంది కోలుకున్నారు. 5,041 మంది చనిపోయారు. 92,353 మంది చికిత్స పొందుతున్నారు.
7. కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దశకు చేరుకుంటే ఈ వ్యాధి సీజనల్ వ్యాధిగా మారే అవకాశం ఉందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. అప్పటి వరకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని సైంటిస్టులు తెలిపారు.
8. ఢిల్లీలో కొత్తగా 4,263 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,25,796కు చేరుకుంది. 4,806 మంది మరణించారు. 1,91,203 మంది కోలుకున్నారు. 29,787 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
9. కర్ణాటకలో కొత్తగా 7,576 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,75,265కు చేరుకుంది. 7,481 మంది చనిపోయారు. 1,06,036 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,69,229 మంది కోలుకున్నారు.
10. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధించింది. ఈ మేరకు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఒక సంవత్సరం పాటు ఎంపీల జీతంలో 30 శాతం కోత విధించనున్నారు.