కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (29-07-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో బుధ‌‌‌‌‌వారం (29-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

1. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1100 కేంద్రాల్లో క‌రోనా టెస్టులు చేస్తున్నామ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. క‌రోనా రాకుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. గురువారం నుంచి రాష్ట్రంలో మొబైల్ క‌రోనా టెస్టింగ్ ల్యాబ్‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు. ఈ ల్యాబ్‌ల ద్వారా ఒకేసారి 10 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌వ‌చ్చ‌న్నారు.

2. క‌రోనా వైర‌స్ స్వ‌ల్ప‌, మ‌ధ్య‌స్థ ల‌క్ష‌ణాలు ఉన్న రోగుల‌కు చికిత్స నిమిత్తం అందిస్తున్న ఫావిపిర‌విర్ అనే మెడిసిన్‌కు గాను జ‌న‌రిక్ మందును హెటిరో ఫార్మా మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. ఫావివిర్ పేరిట స‌ద‌రు మెడిసిన్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ మెడిసిన్ ఒక్కో ట్యాబ్లెట్‌ను రూ.59 కే విక్ర‌యిస్తున్న‌ట్లు హెటిరో తెలిపింది.

3. క‌రోనా చికిత్స‌కు ఉప‌యోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ చ‌క్క‌గా ప‌నిచేస్తుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చాలా మంది వైద్యులు ఈ మెడిసిన్‌ను చికిత్స‌కు వాడుతున్నార‌న్నారు. గ‌తంలో భార‌త్ అమెరికాకు పెద్ద ఎత్తున ఈ మెడిసిన్‌ను స‌ర‌ఫ‌రా చేసిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

4. ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 10,093 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,17,495కు చేరుకుంది. మొత్తం 52,529 మంది కోలుకోగా 1213 మంది చ‌నిపోయారు. మ‌రో 63,753 మంది చికిత్స పొందుతున్నారు.

5. ర‌ష్యాలో కోవిడ్ వ్యాక్సిన్‌ను ఆగ‌స్టు 10 నుంచి ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేసేందుకు ఆ దేశం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అక్క‌డ కోవిడ్ వ్యాక్సిన్‌కు ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. అక్క‌డి గ‌మాలెయా ఇనిస్టిట్యూట్ స‌ద‌రు వ్యాక్సిన్‌ను త‌యారు చేసింది. ఈ క్ర‌మంలో ఆగ‌స్టు 10వ తేదీ వ‌ర‌కు ఎట్టి ప‌రిస్థితిలోనూ వ్యాక్సిన్‌ను ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేయాల‌ని ర‌ష్యా భావిస్తోంది.

6. తెలంగాణ‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1764 క‌రోనా కేసులు నమోద‌య్యాయి. ఒక్క రోజులోనే 12 మంది చ‌నిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 492కు చేరుకోగా.. మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 58,906కు చేరుకుంది. 43,751 మంది కోలుకున్నారు. 14,663 మంది చికిత్స పొందుతున్నారు.

7. దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 48,513 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,31,669 కు చేరుకుంది. ఒక్క రోజులోనే 768 మంది చ‌నిపోయారు. మొత్తం 9,88,029 మంది బాధితులు కోలుకున్నారు. 4,78,582 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

8. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తెలిపారు. గ‌త కొద్ది రోజులుగా త‌న‌కు, త‌న కుటుంబ స‌భ్యుల‌కు స్వ‌ల్పంగా జ్వ‌రం ఉంద‌ని అన్నారు. ఈ క్ర‌మంలో ప‌రీక్ష‌లు చేయించుకున్నామని, క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలిపారు.

9. ఆగ‌స్టు 1 నుంచి అన్‌లాక్ 3.0 ప్ర‌క్రియ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాలను విడుద‌ల చేసింది. అందులో భాగంగా జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరుచుకునేందుకు అనుమ‌తులు ఇచ్చింది. రాత్రిపూట ఉన్న క‌ర్ఫ్యూను ఎత్తివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

10. క‌రోనా వైర‌స్‌కు గాను చైనా అన్ని నిజాల‌ను ప్ర‌పంచానికి తెలియ‌కుండా దాచి పెడుతుంద‌ని ఆ దేశ వైరాల‌జిస్టు లిమెంగ్ యాన్ తెలిపారు. ఆమె ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్నారు. ఓ స్పానిష్ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. క‌రోనా వైర‌స్‌ను వూహాన్ ల్యాబ్‌లో సృష్టించార‌న్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version