కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో శనివారం (08-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,537 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 933 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,88,612కు చేరుకుంది. 42,518 మంది చనిపోగా 6,19,088 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 14,27,006 మంది కోలుకున్నారు.
2. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,080 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,17,040కు చేరుకుంది. మొత్తం 1,29,615 మంది కోలుకున్నారు. 1939 మంది మృతి చెందారు. 85,486 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
3. కరోనా వల్ల దేశవ్యాప్తంగా 196 మంది డాక్టర్లు చనిపోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. వారిలో అధికశాతం మంది 50 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారు. కరోనా బారిన పడ్డ వైద్యులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆ అసోసియేషన్ ప్రధాని మోదీని లేఖ ద్వారా కోరింది.
4. తెలంగాణలో కొత్తగా 2,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 77,513కు చేరుకుంది. 615 మంది చనిపోయారు.22,568 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 54,330 మంది కోలుకున్నారు.
5. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ వరకు కరోనా అదుపులోకి వస్తుందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస రావు తెలిపారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ నెలాఖరు వరకు జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా అదుపులోకి వస్తుందన్నారు.
6. అమెరికాలో కొత్తగా 58,173 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4.9 మిలియన్లకు చేరుకుంది. కొత్తగా 1243 మంది చనిపోయారు.
7. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,822 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,03,084కు చేరుకుంది. 3,38,262 మంది కోలుకున్నారు. 1,47,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
8. కరోనా నేపథ్యంలో ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు వార్షిక పరీక్షలను రద్దు చేశారు. వారికి పాఠశాల అంతర్గత మార్కుల ఆధారంగా ఫైనల్ రిజల్ట్స్ ఇస్తారు. 9, 10 విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి.
9. జేఈఈ మెయిన్స్ 2020 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం మార్గదర్శకాలను విడుదల చేశారు. విద్యార్థులు పలు కచ్చితమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. పూర్తిగా కోవిడ్ జాగ్రత్తలను చేపడుతూ పరీక్షలను నిర్వహిస్తారు.
10. ఎన్ 95 మాస్కులను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌తోనూ శానిటైజ్ చేయవచ్చని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు తెలిపారు. యూవీ లైట్ కన్నా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌తోనే మాస్కులపై ఉండే వైరస్ పూర్తిగా అంతమవుతుందని వారు తెలిపారు.