కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (09-08-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో ఆదివారం (09-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

1. న్యూజిలాండ్ దేశంలో గ‌త 100 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా న‌మోదు కాలేదు. న్యూజిలాండ్ ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం సాధార‌ణ జీవితాన్ని కొన‌సాగిస్తున్నారు. అక్క‌డ క‌రోన నియంత్ర‌ణ‌లో భాగంగా ప్ర‌జ‌లు అద్భుతంగా స‌హ‌క‌రిస్తున్నారు. అందుక‌నే అక్క‌డ క‌రోనా వ్యాప్తి అస్స‌లు లేదు.

2. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. క‌రోనా రిక‌వ‌రీ రేటులో క్ర‌మంగా వృద్ధి క‌నిపిస్తోంది. జూన్ నెల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా రేటు ఏకంగా 20 శాతం వ‌ర‌కు పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా రేటు 68.3 శాతంగా ఉంది.

3. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా క‌రోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయ‌న‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా.. నెగెటివ్ అని వ‌చ్చింది. దీంతో ఆయ‌న కరోనా నుంచి కోలుకున్నార‌ని వైద్యులు ప్ర‌క‌టించారు. ఆగ‌స్టు 2వ తేదీన ఆయ‌న‌కు క‌రోనా సోక‌గా కేవ‌లం వారం రోజుల వ్య‌వ‌ధిలోనే ఆయ‌న క‌రోనా నుంచి కోలుకున్నారు.

4. క‌రోనా నేప‌థ్యంలో విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వ‌దేశానికి తీసుకువ‌చ్చే ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని కేంద్ర పౌర విమాన‌యాన శాఖ ప్ర‌క‌టించింది. తాజాగా దుబాయ్ నుంచి 190 మంది ఇండియాకు రాగా.. ఆ విమానం కేర‌ళ‌లో కూలిపోయింది. అందులో 18 మంది చ‌నిపోయారు. అయిన‌ప్ప‌టికీ మిష‌న్‌ను కొనసాగిస్తామ‌ని తెలిపారు.

5. దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 64,399 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 21,53,011 కు చేరుకుంది. 6,28,747 మంది చికిత్స పొందుతున్నారు. 14,80,885 మంది కోలుకున్నారు. మొత్తం 43,379 మంది మృతి చెందారు.

6. తెలంగాణ‌లో కొత్త‌గా 1982 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 79,495కు చేరుకుంది. 55,999 మంది కోలుకున్నారు. 22,869 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 627 మంది చ‌నిపోయారు.

7. సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి ద‌శ‌ల‌వారీగా స్కూళ్ల‌ను ప్రారంభించాల‌ని కేంద్రం యోచిస్తోంది. సెప్టెంబ‌ర్ 1 నుంచి న‌వంబ‌ర్ 14వ తేదీ వ‌ర‌కు ద‌శ‌ల‌వారీగా 1 నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు స్కూళ్ల‌ను ప్రారంభించ‌నున్నారు.

8. ఏపీలో కొత్త‌గా 10,820 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,27,860కు చేరుకుంది. 87,112 మంది చికిత్స పొందుతున్నారు. 1,38,712 మంది కోలుకున్నారు. 2036 మంది చ‌నిపోయారు.

9. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ప‌నిచేస్తున్న వారిలో ఇప్ప‌టి వ‌ర‌కు 743 మందికి క‌రోనా సోకింద‌ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ తెలిపారు. వారిలో 400 మంది కోలుకోగా, మ‌రో 338 మంది చికిత్స పొందుతున్నారు. మ‌రో 5 మంది చ‌నిపోయారు.

10. మ‌హారాష్ట్ర‌లో ఒక్క రోజే 12,248 కరోనా కేసులు కొత్త‌గా న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య అక్క‌డ 5,15,332కు చేరుకుంది. 1,45,558 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,51,710 మంది కోలుకున్నారు. మొత్తం 17,757 మంది చ‌నిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version