ఈజిప్టు రాణి క్లియోపాత్రా … త‌న‌తో శృంగారంలో పాల్గొనే వ్యక్తుల‌ను ఉరి తీయించేద‌ట..!

-

క్లియోపాత్రా egypt queen cleopatra తన అంతఃపురంలో నిత్యం ఒక పురుషుడితో శృంగారంలో పాల్గొనేదట. అయితే ఆ మరుసటి రోజే ఆ పురుషున్ని ఉరి తీయించేదట. ఆ నిబంధనకు ఒప్పుకునే చాలా మంది ఆమెతో ఆ పని చేసేందుకు వెళ్లేవారట.

క్రీస్తు పూర్వం 48వ సంవత్సరంలో ఈజిప్టును పరిపాలిన మహారాణిగా క్లియోపాత్రాకు పేరుంది. రాజకీయ వ్యూహాలు రచించడంలో ఆమె సిద్ధహస్తురాలు. కొన్ని సార్లు ఆమె ఎత్తులకు చక్రవర్తులే చిత్తయిపోయారు. క్రీస్తు పూర్వం 69వ సంవత్సరంలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియలో జన్మించిన క్లియోపాత్రా టాలమీ వంశస్థురాలు. ఆమె కుటుంబం ఈజిప్టును సుమారుగా 400 ఏళ్ల పాటు పాలించినట్లు చరిత్ర చెబుతోంది. అయితే క్లియోపాత్రా సాధారణ మహారాణి కాదు. ఆమె గురించిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

* క్లియోపాత్రా గొప్ప అందగత్తె. ఆమె ముక్కు కొంచెం పొడవుగా ఉంటుంది. కానీ అది సరిగ్గా ఉంటే ఆమె అందం వర్ణించడానికి వీలు కాదని చరిత్ర చెబుతోంది. అందువల్లే ఆమెను ఎంతో మంది రాజులు కోరుకున్నారట.

* క్లియోపాత్రా తన అంతఃపురంలో నిత్యం ఒక పురుషుడితో శృంగారం లో పాల్గొనేదట. అయితే ఆ మరుసటి రోజే ఆ పురుషున్ని ఉరి తీయించేదట. ఆ నిబంధనకు ఒప్పుకునే చాలా మంది ఆమెతో ఆ పని చేసేందుకు వెళ్లేవారట.

* క్లియోపాత్రా అసలు పేరు క్లియోపాత్రా VII. ఆమె కన్నా ముందు 6 మంది క్లియోపాత్రాలు ఉండేవారు. చరిత్రలో ప్రాచుర్యం పొందింది మాత్రం క్లియోపాత్రా VII కావడం విశేషం.

* క్లియోపాత్రా మహారాణి మాత్రమే కాదు. ఆమెకు పలు ఇతర రంగాల్లోనూ ప్రవేశం ఉంది. ఆమె ఒక గొప్ప రచయిత. బహుభాషా కోవిదురాలు. అప్పట్లోనే ఆమెకు 7కు పైగా భాషలు వచ్చట. కాస్మెటిక్స్ అనే ఓ వైద్యశాస్త్ర పుస్తకాన్ని ఆమె రచించింది. వెంట్రుకల సంరక్షణపై అనేక చిట్కాలతో కూడిన మరొక పుస్తకాన్ని కూడా ఆమె రాసింది.

ఈజిప్టు రాణి క్లియోపాత్రా | egypt queen cleopatra

* క్లియోపాత్రా తన అధికారానికి అడ్డం వస్తున్నారనే నెపంతో సొంత చెల్లెలు, తమ్మున్నే హత్య చేయించింది.

* రోమన్ అయిన జూలియస్ సీజర్ ఈజిప్షియన్ అయిన క్లియోపాత్రాతో సహజీవనం చేయడం, పిల్లల్ని కనడం రోమన్లకు నచ్చలేదు. దీంతో సీజర్‌ను హతమారుస్తారు. అప్పుడు క్లియోపాత్రా రోమ్‌లోనే ఉంటుంది.

* క్లియోపాత్రాకు మొత్తం 4 మంది సంతానం. కానీ వారిలో ఒక్కరు మాత్రమే బతికారు. క్లియోపాత్రా కుమార్తె క్లియోపాత్రా సెలిన్ మహారాణి అవుతుంది.

* జూలియస్ సీజర్, మార్కస్ ఆంటోనియస్‌లతో సహజీవనం చేస్తూ.. వారితో పిల్లల్ని కన్న క్లియోపాత్రా తన సామ్రాజ్యాన్ని బాగా విస్తరించింది.

* క్లియోపాత్రా ఒకానొక సమయంలో నిరాదరణకు గురవడంతో ఆమె తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమె అత్యంత ప్రమాదకరమైన విషం కలిగిన పాముతో తన వక్షోజాలకు కాటు వేయించుకుని చనిపోయింది. ఆమెతోపాటు ఆమె చెలికత్తెలు కూడా అలాగే ప్రాణాలు విడిచారు. అయితే ఈ విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఆమెకు ఎవరో విషం ఇచ్చి చంపారని కొందరంటారు. ఏది ఏమైనా.. ఒకప్పుడు క్లియోపాత్రా మహా మహా చక్రవర్తులకే తన రాజకీయ వ్యూహాలతో, ఎత్తులతో ముచ్చెమటలు పట్టించిన గొప్ప మహారాణిగా చరిత్రలో నిలిచిపోయిందన్నది సత్యం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version