దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా భారత్ లో కొత్తగా 1946 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,46,34,376కు చేరింది. ఇందులో 4,40,79,485 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,923 మంది మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. మరో 25,968 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనా సోకి నలుగురు మృతి చెందగా.. 2417 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.
ఇక మొత్తం కేసుల్లో 0.06 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని, రోజువారీ పాజిటివిటీ 0.75 శాతానికి పడిపోయిందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.41 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొంది.