దేశంలో కరోనా అంతానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగం చేసింది. వివిధ రాష్ట్రాలు తమ ప్రజలకు కోవిడ్ టీకాలను ఇస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లా వందశాతం కోవిడ్ టీకా వేసిన జిల్లాగా రికార్డ్ స్రుష్టించింది. ఈ జిల్లాలో కోవిడ్ టీకా తీసుకునే అర్హత ఉండి, 18 ఏళ్లకు పైబడిన వారందరికీ టీకాలు అందాయి. అంతకుముందు గత ఆగస్టులోనే కిన్నౌర్ జిల్లాలోని 18 ఏళ్లకు పైబడిన ప్రజలంతా మొదటి డోసు కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య వందశాతాన్ని చేరింది.
దేశంలో వందశాతం కరోనా వ్యాక్సినేటెడ్ జిల్లా ఏదో తెలుసా…?
-