కరోనాతో ప్రపంచం కలవరపడుతోంది. కొత్తకొత్త వేరియంట్లతో గుబులు పుట్టిస్తోంది. ఇన్నాళ్లు ఆరోగ్యంపై ప్రభావం చూపిన కరోనా తాజాగా మనిషి సగటు ఆయుర్ధాయాన్ని కూడా తగ్గించేస్తోందని యూకే పరిశోధనలో తేలింది. రెండో ప్రపంచయుద్దం తరువాత ఈస్థాయిలో ఆయుక్షీణత చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి అని పరిశోధన టీం తెలిపింది. 29 దేశాలపై చేసిన పరిశోధనలో 27 దేశాల్లో ప్రజల జీవన కాలంలో తగ్గుదల నమోదైంది. 2015 సంవత్సరంతో పోలిస్తే 15 దేశాల్లోని మహిళలు, 10 దేశాల్లోని పురుషుల ఆయుర్ధాయం 2020లో తగ్గింది. దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఉన్న మరణాల రేటును కూడా కరోనా మార్చివేసిందన పరిశోధకులు అభిప్రాయపడ్డారు. దాదాపుగా 11 దేశాల్లో ప్రజల ఆయుర్థాయం ఒక సంవత్సరం దాకా తగ్గిందని పరిశోధకులు తేల్చారు. పురుషుల ఆయుర్ధాయం స్త్రీల కన్నా తగ్గినట్లు
కరోనా ఎంత పని చేసింది.. ఏకంగా ఆయువునే తగ్గించేసింది.
-