తెలంగాణ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ మరో లేఖ రాశారు. కెసిఆర్ జమానా -అవినీతి ఖజానా… అని సకల జనులు తెలంగాణలో ఘోషిస్తున్నారు? ప్రగతి భవన్ ‘అవినీతి భవన్’గా, ‘తెలంగాణ ద్రోహులకు నిలయం’గా మారింది అన్నది వాస్తవం? కాదా అని ప్రశ్నించారు బండి సంజయ్. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు, ధనవంతుడు కెసిఆర్ అని పేరుంది… దీనికి మీరు స్పందించి, మీ నిజాయితీని, సచ్ఛీలతను నిరూపించుకొంటారా? అని నిలదీశారు. 2014లో ముఖ్యమంత్రి పదవి చేపట్టే నాటికి కేసీఆర్ ఆస్తులు, ఆయన బంధువులు ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత? అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ పేరిట అంచనాలు పెంచి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు కొల్లగొట్టారా లేదా? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, ఇతర సాగు నీటి ప్రాజెక్టులు నిర్మాణంలో, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ ప్రాజెక్టుల, విద్యుత్ కొనుగోళ్లు, ప్రభుత్వ భూములు అమ్మకాల్లో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు. వీటికి సంబంధిచిన ఫైల్స్, సంబంధిత పత్రాలు అఖిలపక్షం ముందు పెట్టి దీనిపై చర్చించడానికి కేసీఆర్ ముందుకు వస్తారా? అని నిలదీశారు బండి సంజయ్. బంగారు తెలంగాణ చేస్తానని, అక్రమ మార్గాల ద్వారా కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టి కేసీఆర్ కుటుంబాన్ని, ఆయన బంధువులను, టీఆర్‌ఎస్ పార్టీ వారిని బంగారుమయం చేసి ప్రజలను బికార్లుగా మార్చిన ఘనత కేసీఆర్‌ది కాదా..? అని ప్రశ్నించారు.