మెడికల్ కాలేజీలో కరోనా కలకలం.. ఏకంగా 66 మంది మెడికల్ స్టూడెంట్స్ కు మహమ్మారి.

-

కరోనా ఈ పేరు చెబితేేనే దేశాలకు దేశాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తుండటంతో దీని బారిన పడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం యూరప్ దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. మనదేశంలో మాత్రం ప్రస్తుతానికి రోజూ వారీ కేసులు తక్కువగా నమోదవుతున్నప్పటికీ ముప్పు పూర్తిగా తొలిగిపోలేదు. అయితే ఇటీవల కరోనా వ్యాప్తి తగ్గడంతో స్కూళ్లు, కాలేజీలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇదే కొంప ముంచుతోంది. ఇటీవల కాలంలో పలు పాఠశాలల్లో, కాలేజీల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా కర్ణాటక ధార్వాడ్ 66 మంది మెడికల్ స్టూడెంట్లకు కరోనా సోకింది. వైరస్ సోకిన వారంతా ఎస్డీఎమ్ మెడికల్ కాలేజీ విద్యార్థులే. వీరంతా రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డారు. కరోనా కేసులతో కళాశాల యాజమాన్యం అప్రమత్తమైంది. విద్యార్దులు ఉంటున్న రెండు హాస్టళ్లను మూసివేశారు. సుమారు 400 మంది విద్యార్థులకు కరోనా నిర్థారణ పరీక్షలు చేయాలని నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version