“చంద్రబాబుకేమి పోయేకాలం వచ్చింది”… అని అడుగుతున్నారు!!

-

ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఇది కాదు. హస్తినలో ఉన్న పెద్దల హస్తాల్లో రాష్ట్రాలు, వాటి భవిష్యత్తు ఉండకూడదని పోరాడిన నాయకుడు స్థాపించిన పార్టీకి అధినేతగా ఉంటూ.. ఇలా కాళ్లు మొక్కే కార్యక్రమం ఏమిటి? అసలు మోడీ కాళ్లు చంద్రబాబు ఎందుకు పట్టుకోవాలి? అంత కర్మేమొచ్చింది? మోడీ ఏ బిల్లుపెట్టినా తంధానతాన అని ఎందుకు అంటున్నాడు? అంటూ ప్రశ్నల వర్షాలు కురిపించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ!

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్షాలు నిరసన దీక్ష చేపట్టిన సందర్భంగా స్పందించిన నారాయణ… బాబుకేమి పోయేకాలం వచ్చింది? అని సూటిగా ప్రశ్నించారు!

ఎన్టీఆర్ స్పూర్తికి వ్యతిరేకంగా ఎలా నడుచుకోగలుగుతున్నారు? ఎన్టీఆర్ పేరు తలస్తూ, ఆయన విగ్రహాలకు అవసరమైనప్పుడల్ల దండలు వేసే చంద్రబాబు… ఎన్టీఆర్ కోరుకున్న ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా మోడీ నిర్ణయాలు తీసుకుంటే ఎందుకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు నారాయణ!

ఈ సందర్భంగా వ్యవసాయ చట్టం పై మరింతగా స్పందించిన నారాయణ.. ఆ చట్టం ప్రజా వ్యతిరేకగా ఉందని.. ఈ బిల్లు రైతాంగానికి పూర్తిగా వ్యతిరేకమైనదని.. అందుకే తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కార్పొరేటు కంపెనీలకు కొమ్ము కాయడమే లక్ష్యంగా.. ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహారిస్తోందని మండిపడ్డారు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version