మోడీ రాకపై నారాయణ వ్యంగ్యాస్త్రాలు..

-

ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో మోడీపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన నారాయాణ.. బలం లేకున్నా ప్రభుత్వాలను పడగొట్టి 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన మోదీ హైదరాబాద్‌కు వస్తున్నారని మండిపడ్డారు. మరి ఆయన తీరును బీజేపీ సమర్థిస్తుందా? అని ప్రశ్నించారు నారాయణ. రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్న బీజేపీ ఫెడరల్ స్ఫూర్తికి తాము విరుద్ధమని ఈ సమావేశాల్లో తీర్మానం చేయాలని సూచించారు నారాయణ.

గత ప్రభుత్వాలు రూ. 40 లక్షల కోట్లు అప్పు చేస్తే మోదీ ఆ మొత్తాన్ని రూ. 85 లక్షల కోట్లకు తీసుకెళ్లారని, సన్యాసినని చెప్పుకునే మోదీ తన మేకప్ కోసం నెలకు రూ. 70 లక్షలు ఖర్చు చేస్తున్నారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని నారాయణ అన్నారు. మోదీ హయాంలో 25 మంది రూ. 25 లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారన్నారు. అమిత్ షాపైనా నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నారాయణ. అమిత్ షా దేశంలోనే నంబర్ వన్ క్రిమినల్ అంటూ నారాయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version