సీపీఎల్‌ 2020 7వ మ్యాచ్‌.. సెయింట్‌ కిట్స్‌పై సెయింట్‌ లూసియా విజయం..

-

ట్రినిడాడ్‌లోని బ్రియాన్‌ లారా స్టేడియంలో జరిగిన కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) 2020 టోర్నీ 7వ మ్యాచ్‌లో సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియాట్స్‌ పై సెయింట్‌ లూసియా జూక్స్‌ జట్టు 10 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో ముందుగా సెయింట్‌ కిట్స్‌ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. సెయింట్‌ లూసియా బ్యాటింగ్‌ చేసింది.

నిర్ణీత 20 ఓవర్లలో సెయింట్‌ లూసియా 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆ జట్టులో ఏడీఎస్‌ ఫ్లెచర్‌ (33 బంతుల్లో 46 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్సర్‌), మహమ్మద్‌ నబీ (22 బంతుల్లో 35 పరుగులు, 1 ఫోర్‌, 3 సిక్సర్లు)లు రాణించారు. సెయింట్‌ కిట్స్‌ బౌలర్లలో సొహెయిల్‌ తన్వీర్‌, జాగ్గెసార్‌లకు తలో 2 వికెట్లు దక్కగా, ఆర్‌ఆర్‌ ఎమ్రిట్‌ 1 వికెట్‌ తీశాడు.

అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన సెయింట్‌ కిట్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది. దీంతో విజయం సెయింట్‌ లూసియాను వరించింది. సెయింట్‌ కిట్స్‌ జట్టులో రామ్‌దిన్‌ (35 బంతుల్లో 46 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), లెవిస్‌ (20 బంతుల్లో 29 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు. సెయింట్‌ లూసియా బౌలర్లలో కుగెలెయిన్‌ 4 వికెట్లు పడగొట్టగా, చేజ్‌ 3 వికెట్లు తీశాడు. మరొక వికెట్‌ నబీకి దక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version