65వ పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి శనివారం నాడు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సభ్యుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పద్మభూషణ్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
పద్మభూషణ్ @KChiruTweets గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 22, 2020
ఇకపోతే శనివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి సతీసమేతంగా వెళ్లి ఆయన్ని అభినందించిన విషయం తెలిసిందే.