RC15‌ నుంచి మరో లీక్..ఆ పాత్ర పోషిస్తున్నానని రివీల్ చేసిన రామ్ చరణ్

-

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తున్నారు. RRR కంప్లీట్ చేసి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ ..మరో వైపున ‘ఆచార్య’ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే RC15 ఫిల్మ్ అమృత్ సర్ షెడ్యూల్ కంప్లీట్ చేశాడు. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్రలో వైవిధ్యం ఉంటుందని చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి.

రామ్ చరణ్ స్టూడెంట్ లీడర్ ప్లస్ పొలిటీషియన్ గా కనిపిస్తారని రకరకాల న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కాగా, తాజాగా RC15లో తన రోల్ పై రామ్ చరణ్ క్లారిటీనిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబురాల్లో భాగంగా ఓ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్..తనకు సర్వీసుల పట్ల ఉన్న ప్రేమను తెలిపారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో తాను ఐపీఎస్ (IPS)ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నానని చెప్పారు.

ఆ ఫిల్మ్ స్టోరిలో భాగంగా తను ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి చదువుకుని మళ్లీ ఐఏఎస్(IAS) ఆఫీసర్ గా పాస్ అవుతానని పేర్కొన్నాడు. అలా తన పాత్రలోని వేరియేషన్స్ ను చెప్పుకొచ్చారు రామ్ చరణ్. ఈ సంగతి తెలుసుకుని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

మెగా అభిమానులు ఈ సందర్భంగా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ ఆర్ సీ 15 #RC15 పేరిట ట్వీట్స్ చేస్తున్నారు. అలా ఈ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రాలన్నిటిలోనూ ఆయన పాత్రకు వేరియేషన్స్ ఉంటుండటం పట్ల మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

RRR చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్, అల్లూరి సీతారామరాజు, దేశ భక్తుడుగా మూడు వేరియేషన్స్ అత్యద్భుతంగా చూపించారు. ఇక ‘ఆచార్య’ చిత్రంలోనూ రామ్ చరణ్ పోషించిన ‘సిద్ధ’ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయని, తనకు అవకాశం వస్తే తాను ‘సిద్ధ’ పాత్ర పోషిస్తానని స్వయంగా మెగాస్టార్ చిరంజీవియే చెప్పారు. అలా మొత్తంగా రామ్ చరణ్ కెరీర్ లో వైవిధ్యభరితమైన పాత్రలు కలిగిన సినిమాలు పడుతుండటం విశేషం. శంకర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version