వరి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రజల్లో ఒక్క రకమైన సెంట్ మెంట్ ను సీఎం కేసీఆర్ సృష్టిస్తున్నాడని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. రైతుల్లో సెంట్ మెంట్ సృష్టించి కేంద్ర ప్రభుత్వంపై అనవసర నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో
కిసాన్ మోర్చ నిర్వహించిన రైతు సదస్సులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సభలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ తీవ్రమైన విమర్శలు చేశారు. రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యాడని విమర్శించాడు.
అప్పుడు తానే వరి ధాన్యం కొనుగోలు చేస్తానని ప్రకటించి.. నేడు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల జీవితాలతో రాజకీయాలు చేయొద్దని అన్నారు. బియ్యంతో పాటు నూకలకు కూడా ఎఫ్‌సీఐ ధర కట్టిస్తుందని అన్నారు. అది కాకుండా.. రూ. 1000 కోట్లు అదనం గా వస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణలో వ్యతిరేకిత తీసుకురావాలనే కుట్రతోనే కేసీఆర్ వడ్ల కొనుగోలు డ్రామాను తీసుకువచ్చారని ఆరోపించారు. అలాగే చదువుకున్న కేటీఆర్.. గవర్నర్ పై చేసిన వ్యాఖ్యలు బాధకలిగించాయని అన్నారు.