క్రియేటివిటి మాములుగా లేదుగా..! ఏకంగా పెన్నులపైనే మాస్‌ కాపీయింగ్‌..కానీ..

-

పరీక్షలు దగ్గరపడ్డాయంటే.. అటు బాగా చదివే వాళ్లకు ఇంకా ప్రిపేర్‌ అవ్వాలని టెన్షన్‌..ఇక డల్లర్స్‌కు అయితే అది గడ్డుకాలమే..ఎట్లారాసామీ గట్టెక్కేది అనుకుంటూ ఉంటారు.. కాపీలు కొట్టడం, స్లిప్పులు పెట్టుకెళ్లడం కామనే..మన ఫ్రెండ్‌ గాడి దాంట్లో చూసి కాపీ కొట్టాలంటే.. ముందు వాడికి ఎంతో కొంత వచ్చి ఉండాలిగా..అందుకే ఇక్కడ ఓ విద్యార్థి హెటెక్‌ లెవల్లో ఎరేంజ్‌ చేశాడు.. ఎగ్జామ్‌ రాసే పెన్నునే సాధనంగా వాడుకున్నాడు.. పెన్నులపైనే మ్యాటర్‌ అంతా చిన్న చిన్న అక్షరాలుగా రాశాడు. కానీ చివరకి ఏమైందంటే..

స్పెయిన్‌లో లా చదివే ఓ విద్యార్థి పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు తెగబడ్డాడు. బ్లూ క్యాప్‌ ఉన్న 11 పెన్నులను తీసుకుని వాటి చుట్టూ చిన్న అక్షరాలతో జవాబులను రాసుకెళ్లాడు. పరీక్ష సమయంలో కాపీకొడుతుండగా పాపం ఉపాధ్యాయులకు దొరికిపోయాడు. సాధారణంగా వాటిని చూస్తే పెన్నులాగే ఉంది కదా అనుకుంటాం.. కానీ, కంటికి దగ్గరగా పరిశీలిస్తే తప్ప వాటిపై ఉన్న అక్షరాలు మనకు కనిపించవు. విద్యార్థి మాస్‌ కాపీయింగ్‌ కోసం ఉపయోగించిన పెన్నులు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ అవుతున్నాయి.. వీటిని చూసిన నెటిజన్లు విద్యార్థి ఆలోచన విధానాన్ని మెచ్చుకుంటున్నారు. ఇలా కూడా కాపీ కొట్టచ్చా అంటూ ప్రశంసిస్తున్నారు.. ఇంకొందరు లా స్టూడెంట్‌ అయి ఉండి ఇలా చేయడం ఏంటి అని తిడుతున్నారు. రాస్తే రాశాడు ఏ ఒకటో రెండు పెన్నులపై రాసుకెళ్తే సరిపోయేది. కానీ మనోడు.. ఏకంగా 11 పెన్నులపై రాసేసరికి ఎవరికైనా డౌట్‌ వస్తుంది.

చిన్నప్పుడు ఇలాంటి తిప్పలు ఎన్నో పడి ఉంటారు. షూస్‌లో పెట్టుకెళ్లడం, అబ్బాయిలతో షట్‌ కాలర్‌లో పెట్టేవాళ్లు. అమ్మాయిలతో చున్నీలలో దాచుకునేవాళ్లు. లేదంటే..పెన్నులు వేసుకునే బాక్స్‌లో ఒక పేపర్‌ ఎలాగూ వేసుకుంటాం కదా.. ఆ పేపర్‌ కింద పెట్టడం.. అబ్బో ఆ రోజుల్లో డెడికేషనే వేరు! మీరు ఇలా చేసే ఉంటారు కదా..! ఒకవేళ ఇలాంటి తుంటరి పనులు చేసి ఉంటే.. మీ ఆత్మీయులకు ఈ ఆర్టికల్‌ షేర్ చేసి ఆ రోజులను ఒకసారి నెమరవేసుకోండి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version