సినీ చరిత్రలో మొదటిసారి.. అంతరిక్షంలో షూటింగ్ చేయబోతున్న స్టార్ హీరో..!!

-

సాధారణంగా షూటింగ్ అనేది.. మొత్తం గ్రాఫిక్స్ పైన ఆధారపడి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమా లోని సన్నివేశాలు వెనుక అసలు విషయం రివిల్ చేసిన విషయం తెలిసిందే. ఇది చూసిన వారంతా ఓస్ ఇంతేనా అని కూడా అనుకున్నారు. ఇకపోతే హాలీవుడ్ లో సాహసాలకు కేంద్రబిందువుగా మారిన హీరో.. అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు టామ్ క్రూజ్.. ఈ హాలీవుడ్ యాక్షన్ హీరో చేస్తే రిస్కీ స్టంట్స్.. అలాగే ప్రాణాలకు తెగించి చేసిన ఎన్నో యాక్షన్ సినిమాలు మనం చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక ఈయన చేసే డేంజర్ స్టంట్ లు ప్రపంచంలో ఎవరు కూడా చేయలేరు.

ఇక ప్రస్తుతం ఈ స్టార్ హీరో వయసు 60 సంవత్సరాలు.. ఇకపోతే తాజాగా ఈయన నటించిన టాప్ గాన్ మావెరిక్ సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ చిత్రం ఇప్పటికీ హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో ఆడుతూనే ఉంది. ఈ చిత్రం లో టామ్ క్రూజ్ చేసిన సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంతేకాదు 60 ఏళ్ల వయసులో ఇలాంటి సాహసాలు చేయడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హాలీవుడ్ దర్శకుడు డగ్ లీమన్ తో ఒక సినిమా చేయబోతున్నాడు టామ్ క్రూజ్. అయితే ఇక్కడ విశేషమేమిటంటే ఈ చిత్రం షూటింగు భూమి మీద కాకుండా అంతరిక్షంలో జరగబోతోందట. ఇప్పటివరకు అంతరిక్షం పై కాలు మోపిన వాళ్ళు సైంటిస్టులు మాత్రమే కానీ మొదటిసారిగా ఒక సినిమా షూటింగ్ కోసం అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న ఏకైక హీరోగా టామ్ క్రూజ్ గుర్తింపు తెచ్చుకోబోతున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ బడ్జెట్ 200 మిలియన్ డాలర్లు.. ఇక ఇందులో కేవలం టామ్ క్రూజ్ పారితోషకమే 60 మిలియన్ డాలర్లు కావడం విశేషం. షూటింగ్ మొత్తాన్ని కూడా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లోనే తెరకేక్కిస్తారట. ఈ చిత్రాన్ని నాసా కేంద్రం మరియు ఎలన్ మస్క్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడు చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version