7 కోట్ల ఫాలోవర్స్​ను దక్కించుకున్న తొలి భారతీయుడిగా క్రికెటర్ కోహ్లీ..!

-

ప్రముఖ సోషల్​ నెట్​వర్కింగ్​ వెబ్​సైట్​ ఇన్​స్టాగ్రామ్​లో 7 కోట్ల మంది ఫాలోవర్స్​ను సంపాదించాడు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అనుసరిస్తున్న నాలుగో క్రీడాకారుడిగా కోహ్లీ నిలిచాడు. ఈ మార్క్​ను అందుకున్న తొలి క్రికెటర్​గానూ ఘనత సాధించాడు.

Virat kohil

పోర్చుగల్​కు చెందిన ఫుట్​బాల్​ స్టార్​ క్రిస్టియానో రొనాల్డో (23 కోట్ల 20 లక్షల మందికి పైగా), బార్సిలోనా లెజెండ్​ లియోనాల్​ మెస్సీ (16 కోట్ల పది లక్షల మందికి పైగా), బ్రెజిల్​ ఫుట్​బాల్​ ప్లేయర్​ నెయిమర్​ (14 కోట్ల మంది)లు అత్యధిక ఫాలోవర్స్​తో కోహ్లీ కంటే ముందంజలో ఉన్నారు. విరాట్​ ఇటీవలే బాస్కెట్​బాల్​ స్టార్​ ఆటగాడు లెబ్రాన్​ జేమ్స్​ (6 కోట్ల 90 లక్షల మంది)ను అధిగమించాడు.

ఇన్​స్టాగ్రామ్​లో అత్యధిక ఫాలోవర్లు దక్కించుకున్న భారతీయుడిగా విరాట్​ కోహ్లీ ఘనత సాధించాడు. అతని తర్వాత బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా (5 కోట్ల 50 లక్షల మంది) అనుచరులతో రెండో స్థానంలో ఉంది. ఇన్​స్టాలో ఇటీవలే వేయి పోస్టల మార్క్​ను దాటిన కోహ్లీ.. ఆ సోషల్​మీడియా సైట్​లో గతకొన్ని నెలలుగా చురుకుగా ఉన్నాడు. లాక్​డౌన్​లో తనకు సంబంధించిన వర్కౌట్​ వీడియోలతో పాటు కొన్ని లైవ్​సెషన్లలో పాల్గొన్నాడీ స్టార్​ క్రికెటర్​. ఈ సమయంలో ఇన్​స్టాగ్రామ్​ ద్వారా కోహ్లీ సూమారు రూ.3.6 కోట్లను ఆర్జించాడని ఇటీవలే ఓ సర్వే తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version