గురుద్వారాను మసీదుగా మార్చేందుకు ప్రయత్నించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం..!

-

దాయాది పాకిస్థాన్​లోని ప్రముఖ గురుద్వారాను మసీదుగా మార్చేందుకు ప్రయత్నించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత్​లోని పాక్ హైకమిషనర్ వద్ద ఈ విషయమై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. గురుద్వారాను మసీదుగా మార్చే యత్నాలను అడ్డుకోవాలని సూచించింది. పాకిస్థాన్​ లాహోర్​లోని ఓ గురుద్వారాను మసీదుగా మార్చే ప్రయత్నాలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. భారత్​లోని పాక్ హైకమిషనర్​ వద్ద నిరసన వ్యక్తం చేసింది.

gurudwar

లాహోర్​లోని షాహిదీ అస్థాన్ గురుద్వారాను మసీదుగా మార్చే యత్నాలపై పాకిస్థాన్ హైకమిషనర్​ వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశాం. భాయ్ తారుసింగ్ జీ ప్రాణత్యాగం చేసిన ప్రదేశమైన ఈ గురుద్వారాను షాహిద్ గంజ్​గా పేర్కొంటు మసీదుగా మార్చేందుకు యత్నిస్తోంది పాక్ అని విదేశాంగ శాఖ అధికారి అన్నారు. రత అభ్యంతరాలను.. తీవ్రమైన పదజాలంతో తెలిపినట్లు పేర్కొన్నారు శ్రీవాత్సవ. దీనిపై విచారణ చేపట్టి నివారణ చర్యలను చేపట్టాలని పాక్​ను కోరినట్లు చెప్పారు. పాక్​లోని దేశంలోని మైనారిటీల రక్షణ, మత హక్కులు, సంస్కృతిని కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్లు దాయాది దేశం వివరించినట్లు వెల్లడించారు.1,745 సంవత్సరంలో భాయ్ తారుజీ ప్రాణత్యాగం చేసిన ఈ గురుద్వారా అత్యంత ప్రముఖ గురుద్వారాల్లో ఒకటని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version