ప్రియాంక జవాల్కర్‌తో వెంకటేశ్ అయ్యర్ ప్రేమాయణం.. క్రికెటర్‌పై నెటిజన్ల ట్రోలింగ్..

-

జనరల్‌గా క్రికెటర్స్, హీరోయిన్స్ మధ్య స్పెషల్ రిలేషన్ షిప్ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరు ఏదేని ఈవెంట్ లో కలుసుకోవడం ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుని అలా దగ్గరయ్యే అవకాశాలుంటాయి. అలానే విరాట్ కోహ్లీ అనుష్క కలిశారు. వారి జీవిత బంధంలో ఒక్కటై ముందుకు సాగుతున్నారు కూడా. కాగా, భారత క్రికెటర్ ఒకరు టాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమాయణానికి సిద్ధమయ్యారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

తెలుగు వారు హీరోయిన్ అయి ఇండస్ట్రీలో రాణిస్తున్నవారు తక్కువ మందే. వారి సంఖ్యను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. ప్రియాంక జవాల్కర్ తెలుగమ్మాయి. కాగా, ఈ భామకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో చక్కటి గుర్తింపు వచ్చింది. అయితే, ఆ తర్వాత సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు.

Priyanka Jawalkar Latest Saree Photos

ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ సుందరి.. తన లేటెస్ట్ ఫొటోలను ఇన్ స్టా వేదికగా పంచుకుంది. ఉగాది సందర్భంగా విషెస్ చెప్తూ షేర్ చేసిన ఆ ఫొటోను చూసి ఇండియన్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యార్ ‘క్యూట్’ అని కామెంట్ చేశాడు. అంతే ఇక కథ షురూ అయింది.

వెంకటేశ్ అయ్యర్ కామెంట్ చూసిన ప్రియాంక జవాల్కర్ ‘హూ? యూ’ అని ప్రశ్నించింది. దాంతో నెటిజన్లు వెంకటేశ్ అయ్యర్ ఎవరో నీకు తెలియదా? అని ప్రియాంకపైన నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే భారత జట్టులో సుస్థిరమైన స్థానం పొందిన వెంకటేవ్ హీరోయిన్ ఫొటోకు కామెంట్ ఎందుకు చేయాలని ఆయనపైన ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. వెంకటేశ్ కావాలనే తన ప్రేమ కథను ముందుకు నడిపించడం కోసం ఇలా చేశాడా? అని ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు. చూడాలి మరి.. ఈ స్టోరి మున్ముందుకు ఎంత వరకు సాగుతుందో..

Read more RELATED
Recommended to you

Exit mobile version