రెండోసారి తండ్రి కాబోతున్న క్రికెటర్ రహానే!

-

టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే రెండోసారి తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని రహానే భార్య రాధిక దోపవాకర్ ఇంస్టాగ్రామ్ లో వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఆమె వెల్లడించారు. అంతేకాదు కడుపుతో ఉన్న రాధిక ఆమె భర్త రహానే, కూతురు ఆర్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీంతో అభిమానులు కామెంట్లతో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.

రాధిక, రహనే ఇద్దరూ బాల్య స్నేహితులు. 2014 సెప్టెంబర్ 26 న అజింక్య రహనే, రాధిక దోపవాకర్ ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. 2019 అక్టోబర్ నెలలో వీరికి మొదట పాప పుట్టింది. ఆ పాపకు ఆర్య అనే పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు రెండోసారి రహానే తండ్రి కాబోతున్నారు. రహానే భార్య రాధిక దోపవాకర్ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version