తమిళనాడులో దారుణం..భర్త కోల్పోయిన మహిళలపై అత్యాచారాలు

-

తమిళనాడు అత్యంత అమానుషమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అనాధా శ్రమంలోని మానసిక వికలాంగ, భర్త కోల్పోయిన మహిళలపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్నాయి. లొంగని మహిళలను సంకె ళ్లతో కట్టేసి వారిపైకి కోతులను ఉసిగొల్పి కరిపించారు నిర్వాహకులు. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా ఈ ఘటన జరిగింది.

గుండల పులియూర్ గ్రామంలో ఉన్న అన్బు జ్యోతి అనాధాశ్రమంలోని మానసిక వికలాంగ మహిళలకు మత్తుమందిచ్చి రాడ్స్‌ తో దాడి చేసి అత్యాచారం చేశారు నిర్వాహకులు. ఆశ్రమంలో ఉన్న 142లో పురుషులు109 ఉంటే మహిళలు 33 మంది ఉన్నారు. వారిలో ప్రస్తుతం 16 మంది మిస్సింగ్ అయినట్లు గుర్తించారు రెవెన్యూ, పోలీసు అధికారులు.

తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేయడమేకాకుండా, ఇనుప సంకెళ్లతో కట్టేసి, కోతులతో కరిపించారని ఒడిసా కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసు, రెవెన్యూ అధికారులు… ఆశ్రమంలోని వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version